1 తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించిమహిమపరచబడు నిమిత్తమును,
2 మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విస్వాసము అందరికి లేదు.
3 అయితే ప్రభువు నమ్మతగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండికాపాడును.
4 మేము మీకు ఆజ్ఞాపించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము.
5 దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
6 సహోదరులారా, మావలన పొందిన బోధనప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరునియొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుపేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
7 ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;
8 ఎవనియొద్దను ఉచితముగా ఆహారముపుచ్చుకొనలేదు ప్రయాసముతోను కష్టముతోను దివారాత్రము పనిచేయుచు జీవనము చేసితిమి.
9 మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమిగాని, మాకు అధికారములేదని చేయలేదు.
10 మరియు మేము మీయొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా.
11 మీలో కొందరు ఏ పనియుచేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
12 అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు, స్వంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
13 సహోదరులారా, మీరైతే యోగ్యమైన కార్యములు చేయుటలోవిసుకవద్దు.
14 ఈ పత్రికమూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడనియెడల అతని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
15 అయినను అతని శత్రువునిగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి.
16 సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతివిధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మికందరికి తోడైయుండును గాక.
17 పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడైయుండును గాక.

No comments:
Post a Comment